Asianet News TeluguAsianet News Telugu

#Samantha: సమంతను హాస్పటిల్ లో కలిసి చైతూ ఓదార్చారా?.. నిజం ఇదే

సమంత  మాజీ భర్త నాగచైతన్య, నాగార్జున కూడా పర్శనల్ గా కలిసి  ఓదార్చినట్లు చేసినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే నాగచైతన్య సోదరుడు అఖిల్‌ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.  

Is it true? Naga Chaitanya Meet Samantha in Hospital
Author
First Published Nov 2, 2022, 7:19 AM IST

ఇప్పుడు సోషల్ మీడియాలో  చర్చంతా నటి సమంత ఆరోగ్యం గురించే. గత కొంతకాలంగా ఈమె కామెంట్స్,  గ్లామరస్‌ పొటోలు, నాగచైతన్య తో డైవర్స్  గురించి రకరకాలుగా చర్చించుకున్న జనం ఇప్పుడు ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి చర్చించుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న సమంత ది ప్యామిలీ మెన్‌ – 2, వెబ్‌ సిరీస్‌తో జాతీయస్థాయిలో నటిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే సమంత, ఇప్పుడు మయాసిటీస్‌ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల స్వయంగా వెల్లడించారు.

ఈ విషయం బయిటకు రాగానే ఆమె అభిమానులు షాక్‌కు గుర య్యారు. ఇక సహ నటీనటులు, స్నేహితులు, సన్నిహితులు సమంతను ఓదార్చే పనిలో పడ్డా రు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నుంచి పలువురు సమంతలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఆమె మాజీ భర్త నాగచైతన్య, నాగార్జున కూడా పర్శనల్ గా కలిసి  ఓదార్చినట్లు చేసినట్లు సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే నాగచైతన్య సోదరుడు అఖిల్‌ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.  అయితే నాగచైతన్య స్వయంగా హాస్పటిల్ కు వెళ్లి కలిసి, ఆమెను ఓదార్చినట్లు చెప్తున్నవార్తల్లో నిజం లేదు అని తెలుస్తోంది. నిజంగా నాగచైతన్య వెళ్తే దాన్ని దాచిపెట్టడం చాలా కష్టం. ఇలాంటి హై ప్రొఫైల్ సెలబ్రెటీ ..హాస్పటిల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మెబైల్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలోకి వచ్చేస్తాయి. అలాంటిదేం జరగలేదు.

అలాగే సమంత ఏ హాస్పటిల్ లోనూ లేరని, హైదరాబాద్ లోని తన ఇంటివద్దనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె తన రెగ్యులర్ వర్క్,ప్రొఫెషనల్ పనులు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అసలు హాస్పటిల్ లోనే  లేని ఆమె దగ్గరకు నాగచైతన్య వెళ్లి ఓదార్చడు అనటం మాత్రం అసంబద్దం అని మీడియా విశ్లేషణ చేస్తోంది.

ఇక సమంత చాలా ధైర్యంగా ఉంది. అదే ఆమెకు రక్షగా మారనుంది. ''   మీ అందరి ప్రేమ, అనుబంధమే  లైఫ్‌ నాకు ఇస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. కొన్ని నెలల నుంచి ‘మయోసిటిస్‌’ Myositis( కండరాల బలహీనత) అనే వ్యాధితో బాధపడుతున్నాను.  ఈ విషయాన్ని పూర్తిగా రికవర్‌ అయ్యాక మీతో చెబుదాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుంది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని రియలైజ్‌ అయ్యాను.

నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్స్‌ కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా నాకు మంచి రోజులు, అలాగే చెడు రోజులు ఉన్నాయి. నేను ఇదంతా హ్యాండిల్‌ చేయలేనేమో అని అనుకున్నసందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని ఆశిస్తున్నాను లవ్‌ యూ'' అంటూ ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసింది సామ్‌. ఈ పోస్ట్‌ చూసిన వారు 'గెట్‌ వెల్‌ సూన్‌ సామ్‌' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం ఈ నెల 4వ తేదీన దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios