మనకున్న సీనియర్ హీరోలలో ఒకరైన బాలయ్య కొద్దిగా డిఫరెంట్. తన పనేంటో, తన సినిమాలేంటో అన్నట్లుగా ఉంటారు. మాటిమాటికి మీడియాలో ఉండటానికి ఇష్టపడరు. అలాగే తన పర్శనల్ లైఫ్ ని ప్రపంచానికి చూపించరు. కాని ఇప్పుడా అవసరం వచ్చింది. తన అన్న కుమారుడు ఎన్టీఆర్..‘బి ద రియల్‌ మేన్‌’  ఛాలెంజ్ ని వదిలాడు. దానికి స్పందనగా తన ఇంటి వీడియోతో బాలయ్య వస్తాడా లేదా అన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాశంగా మారింది. 
  
ఎన్టీఆర్ అప్పటికీ బాలయ్యకే కాదు, మెగాస్టార్‌ చిరంజీవికీ, అక్కినేని నాగార్జునకీ, విక్టరీ వెంకటేష్‌కీ ఈ ఛాలెంజ్ ని విసిరాడు . ఆ నలుగురూ తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్‌ స్టార్స్. చిరంజీవి ఇప్పటికే యంగ్‌ టైగర్‌ ఛాలెంజ్ ని ఏక్సెప్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. నాగార్జున ఇలాంటి విషయాల్లో ముందే ఉన్నారు. ఇక వెంకీ కి కూడా సరదా ఎక్కువే. కాబట్టి ఆ వీడియోలన్నీ బయిటకు ఖచ్చితంగా వస్తాయి. కానీ బాలయ్య మాత్రం వీడియో తీసి వదలుతారా లేదా అని సస్పెన్స్ గా మారింది.  ఈ విషయమై నందమూరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే ఇలాంటి సందర్బాల్లో బాలయ్య వెనకడుగు వేసే అవకాసం తక్కువ. కాబట్టి బాలయ్య నుంచి కూడా ‘బి ద రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ వీడియో వచ్చేయడానికే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది మీడియా. ఇక బాలయ్య తన తాజా చిత్రం బోయపాటి శ్రీను తో చేస్తున్నారు. ఈ సినిమాలో విభిన్నంగా కనపడనున్నారు. అఘోరా పాత్రలో బాలయ్య కనపడతారని ఇప్పటికే వార్తలు బయిటకు వచ్చాయి. లాక్ డౌన్ తో షూటింగ్ లు ఆగిపోయాయి.