బాలీవుడ్ లెజెండరీ నటుడు, ఐకానిక్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్‌ ఖాన్ గత నెల 29న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసింది. ఆయన మృతికి బాలీవుడ్‌ ఇండస్ట్రీతో పాటు హాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేశారు. ఇర్ఫాన్‌ అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఆయన భార్య  సుతాప, ఇద్దరు కుమారులు బాబిల్‌, అయాన్‌లతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఎన్నో విభిన్న పాత్రల్లో నటించిన ఇర్ఫాన్‌, అరుదైన క్యాన్సర్‌తో సుధీర్ఘ పోరాటం చేశారు. న్యూరో ఎండోక్రైన్‌ ట్యూమర్‌ అనే రేర్ క్యాన్సర్‌తో ఆయన రెండేళ్ల పాటు పోరాడారు. విదేశాల్లో చికిత్స తీసుకున్న ఇర్పాన్ కొలుకొని ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే మరోసారి ఆరోగ్య క్షీణించటంతో ముంబైలోని కోకిలా బెన్‌ హాస్పిటల్‌లో చేరారు. ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు.

ఇర్ఫాన్ మరణించిన తరువాతి రోజు సుతాప ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఇర్ఫాన్‌ మృతిలో బాధపడిన ప్రతీ ఒక్కరు తమ కుటుంబ సభ్యలే అన్నారు సుతాప. కొన్ని లక్షల మంది ఆయన మరణంతో ఆవేదన చెందుతుంటే మా కుటుంబ సమస్య అని ఎలా అనుకుంటాం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇర్ఫాన్ మరణంతో ఆమె జీవితంలో ఏమీ కోల్పోలేదని తెలిపింది. నిజానికి ఆయన  చూపించన మార్గంలో మన నడవటానికి ఇది సరైన సమయం అంటూ ఆమె తన బాధను పంచుకుంది.