ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత 'ఝలక్ దిఖ్‌లాజా' అనే డాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు నటుడిగా తన టాలెంట్ చూపించడానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్రికెటర్ గా సత్తా చాటిన ఇర్ఫాన్ ఇప్పుడు సినిమాల్లోకి రావడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

మొదటి సినిమానే స్టార్ హీరో విక్రమ్ తో కలిసి చేయబోతున్నాడు. ఇటీవల విక్రమ్ తన 58వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమాకి టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. ఇందులో ఇర్ఫాన్ పటాన్ విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఇర్ఫాన్ స్వయంగా వెల్లడించారు. తన కొత్త ప్రయాణం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నానని మీడియా ద్వారా వెల్లడించారు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సక్సెస్‌ఫుల్ ఆల్ రౌండర్‌గాపేరు సంపాదించుకున్న ఇర్ఫాన్ తన కెరీర్ లో మొత్తం 173 మ్యాచ్ లుఆడారు. 2821 పరుగులు, 301 వికెట్లు తీశారు.

ఫాస్ట్ మీడియం స్వింగ్ బౌలర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టిన ఇర్ఫాన్.. 19 ఏళ్లకే నేషనల్ టీంలో చోటు సంపాదించుకున్నాడు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత ఇర్ఫాన్ నటుడిగా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నాడేమో. విక్రమ్ తో సినిమా గనుక సక్సెస్ అయితే తెలుగు సినిమాల్లో కూడా ఆయన్ని చూసే ఛాన్స్ అభిమానులకు దక్కుతుంది.