ఇంకా సినిమాల్లోకి అడుగుపెట్టకపోయినా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ  అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం క్వారెంటైన్‌ లో ఉన్న ఈ భామ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఇరా.

అయితే ఓ అభిమానిని ఇరా ఈ క్వారెంటైన్‌ సమయంలో ఏం చేస్తున్నావ్‌ అంటూ ప్రశ్నించింది. అయితే దానికి ఆ వ్యక్తి సాన్య మల్హోత్రాతో డేటింగ్ చేసే ఆలోచనలో ఉన్నానంటూ సమాధానం ఇచ్చాడు. అయితే అందుకు బదులుగా ఇరా సమాధామిస్తూ నువ్వు లైన్‌ లో ఉండు. ఫస్ట్ నేను డేట్‌ కి వెళ్తా అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా దంగల్ సినిమాలో బబిత పాత్రలో నటించింది సాన్యా మల్హోత్రా.

ఇరా, ఆమిర్‌ ఖాన్‌ మొదటి భార్య రీనా దత్‌ కూతురు. ఆమిర్‌ రీనాతో విడిపోయిన తరువాత కూడా మొదటి భార్య పిల్లలైన ఇరా, జునైద్‌ లతో మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు. ఇరా మ్యూజిక్‌ లో డిగ్రీ పూర్తి చేసిన సొంతంగా షార్ట్ ఫిలింస్‌ తెరకెక్కిస్తుండగా, జునైద్ ఆమిర్ తో కలిసి సినిమా వ్యవహారాల్లో భాగం పంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆమిర్‌ ఖాన్‌ లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా 1994లో రిలీజ్ అయిన హాలీవుడ్‌ సినిమా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌ అని తెలుస్తోంది.