హిస్టారికల్ మూవీ సైరా నరసింహా రెడ్డి అంచనాలను అందుకోకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాతో అయినా స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు, సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివతో ఇటీవల మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకాబోతోంది.  ఇక సినిమాకు సంబందించిన రూమర్స్ రోజుకోటి వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో నక్సల్స్ కి సంబందించి ఎపిసోడ్స్ గట్టిగానే ఉంటాయట. సినిమాలో మెయిన్ గా కథను మలుపు తిప్పే ఎపిసోడ్స్ అవెనని టాక్ వచ్చింది. 

ఇక మెగాస్టార్ కూడా నక్సల్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ విషయం నిజమే అని తెలుస్తోంది. రీసెంట్ గా మెగా కాంపౌండ్ ని అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఒక షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అది పక్కా నక్సల్స్ కి సంబందించిన సీన్స్ కోసమే ప్లాన్ వేసుకున్నట్లు టాక్.

దీంతో మెగాస్టార్ మునుపెన్నడు చూడని పాత్రలో కనిపించనున్నట్లు చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ కి వచ్చేశాయి. హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ పాత్రలో తెలుగమ్మాయి ఈషా రెబ్బకు అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబందించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.