నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

మరోవైపు నితిన్ విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. 

ఈ చిత్రానికి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి 'చదరంగం' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర కథ చదరంగం ఆట నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్  సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

ఇదిలా ఉండగా నితిన్ తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. ఈ చిత్ర టైటిల్ రంగ్ దే. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది.