సైరా తర్వాత చిరంజీవి వరుస చిత్రాలని ఓకె చేస్తున్నారు. త్వరలో కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

ఈ నేపథ్యంలో చిరంజీవి 152వ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నారట. కథ పరంగా ఈ మూవీకి 'గోవింద ఆచార్య' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ టైటిల్ గా దీనినే కొనసాగిస్తారు. టైటిల్ పై చిత్ర యూనిట్ మొత్తం ఏకాభిప్రాయానికి వస్తే అధికారికంగా ప్రకటిస్తారు. 

'గోవింద ఆచార్య' అనే టైటిల్ చాలా బావుందంటూ అప్పుడే అభిమానులు సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టేశారు. ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ తో హోరెత్తిస్తున్నారు. 

చిరు 152 మూవీ కథాంశం దేవాదాయ శాఖకు సంబంధించినదని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు దేవాదాయ శాఖలో చేస్తున్న అవినీతిని వెలికితీసేలా ఈ చిత్రం ఉండబోతోంది. చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా ఈ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.