నార్త్ కు చెందిన ఓ గ్లామరస్ హీరోయిన్ టాలీవుడ్ లోకి రెండేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తొలి చిత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. తొలి చిత్రంలోనే రోమాంటిక్ సీన్స్, గ్లామర్ షో లో రెచ్చిపోయిన ఆ హీరోయిన్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. 

ఆ తర్వాత నటించిన చిత్రాల్లో కూడా సదరు హీరోయిన్ అందాలు ఆరబోసింది. ఇటీవల ఆ హీరోయిన్ తన మేనేజర్ ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. మేనేజర్ ని తొలగించడానికి అనేక కారణాలు వినిపించాయి. తన పేరుతో ఆ మేనేజర్ మోసాలు చేస్తున్నాడని.. పైగా సరైన అవకాశాలు తీసుకురావడం లేదనే ప్రచారం జరిగింది. 

కానీ తాజాగా ఆమె తన మేనేజర్ ని తొలగించడానికి కారణంగా ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. సదరు హీరోయిన్ కి ముంబైలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఇప్పుడిప్పుడే నటుడిగా, దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ సక్సెస్ కావడం లేదు. 

ఖాళీగా ఉన్న తన ప్రియుడి కోసమే ఆమె తన మేనేజర్ ని పనిలోనుంచి తీసేసిందట. దీనితో ఆమె వద్దకు ప్రియుడు వచ్చి వాలిపోయాడట. ప్రస్తుతం అతడే సదరు హీరోయిన్ కాల్ షీట్స్.. ఆమె కోసం వచ్చే నిర్మాతలతో చర్చలు అన్ని చూసుకుంటున్నాడట. మొత్తంగా తన ప్రియుడితోనే ఆమె మేనేజర్ జాబ్ చేయిస్తోందనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.