మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెం150, ప్రతిష్టాత్మకంగా నటించిన సైరా రెండు చిత్రాలు సొంత ప్రొడక్షన్ నుంచే వచ్చాయి. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలని రాంచరణ్ చూసుకున్నాడు. 

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే 152వ చిత్రానికి కూడా రాంచరణ్ ఓ నిర్మాత. ఇదిలా ఉండగా చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నాడని, ఆ చిత్రంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోతున్నట్లు తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 

అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ మరో చిత్రంలో నటించలేదు. పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. అయినా కూడా పవన్ మరో సినిమాలో నటించబోతున్నట్లు ఆధారాల్లేని పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం ఏఎం రత్నం, మైత్రి మూవీస్, హారిక అండ్ హాసిని సంస్థలు ఎదురుచూస్తున్నట్లు.. ఆ జాబితాలోకి రాంచరణ్ కూడా చేరినట్లు తాజా వార్తల సారాంశం. 

కానీ పవన్ మాత్రం సినిమాల ఊసే ఎత్తడం లేదు. రాజకీయంగా తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ వెళుతున్నాడు.