సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పుంజులే కాదు.. పెట్లు కూడా పోటీకి దిగుతున్నాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు ఒకరోజు గ్యాప్ లోనే ఆడియెన్స్ ను ముందుకు రానున్న విషయం తెలిసిందే. జనవరి 11న మహేష్ సినిమా 12న బన్నీ సినిమా థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.

ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.  మహేష్ vs అల్లు అర్జున్.. అని సోషల్ మీడియాలో అభిమానులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఇకపోతే సినిమాలకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ వార్ సైతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంటున్న బ్యూటీస్ రష్మిక మందన్న - పూజా హెగ్డే. ఈ మహేష్ తో మొదటిసారి రష్మిక నటించగా.. డీజే అనంతరం పూజా బన్నీతో రెండవసారి నటించింది.

అయితే ఈ హాట్ కోడి పెట్టలు సంక్రాంతి ఫైట్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా వారి స్టైల్ లో ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. స్టార్ హీరోల అభిమానులే కాకుండా తమను ఇష్టపడేవాళ్లు కూడా సినిమా చూడాలని సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. సినిమా రిలీజ్ డేట్స్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషన్స్ డోస్ ఇంకాస్త పెంచాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ఈ సంక్రాంతి ఫైట్ లో ఈ అందాల కోడిపెట్టెలు ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.

చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్