టాలీవుడ్ లో సమంత తిరుగులేని నటి. ఏ మాయ చేశావే చిత్రం నుంచి సమంత మాయ చేస్తూనే ఉంది. కేవలం కమర్షియల్ చిత్రాలతో మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా సమంత తనని తాను నిరూపించుకుంది. సమంత చివరగా జాను చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. 

తన స్టైలింగ్  విషయంలో కూడా సమంత ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. ఇటీవల కొన్ని చిత్రాల్లో సమంతని గమనిస్తే.. ఎక్కువగా షార్ట్ హెయిర్ తో కనిపిస్తోంది. సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా షార్ట్ హెయిర్ లో కనిపించాలంటే కాస్త భయపడతారు. 

పొడవైన శిరోజాలతో కనిపిస్తేనే అందంగా ఉంటామని భావిస్తారు. కానీ షార్ట్ హెయిర్ తో సమంత స్టైలింగ్ కు సరికొత్త నిర్వచనం చెప్పింది. ఓ బేబీ చిత్రంలో అయితే సమంత షార్ట్ హెయిర్ స్టైలింగ్ ఆకట్టుకుంది. 

ఓ బేబీ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక్క హెయిర్ విషయంలో మాత్రమే కాదు.. డ్రెస్సింగ్ విషయంలో కూడా సమంత మిగిలిన హీరోయిన్లకు విభిన్నం. అందుకే సమంత అభిమానులని అంతగా ఆకట్టుకుంటోంది.