టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో సమంత ఒకరు. కమర్షియల్ చిత్రాలతో పాటు సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా దూసుకుపోతోంది. సమంత కెరీర్ ఆరంభంలో కమర్షియల్ చిత్రాలనే ఎంచుకుంది. కానీ ఇటీవల సమంత మహానటి, యుటర్న్, ఓ బేబీ లాంటి విభిన్న చిత్రాలలో నటించింది. 

సమంత ప్రతిభ గమనించిన దర్శక నిర్మాతలు ఆమె కోసం ఫీమేల్ సెంట్రిక్ కథలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సమంత కోసం రెండు లేడి ఓరియెంటెడ్ కథలని రెడీ చేస్తోందట. ఈ కథలో సమంత దేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పట్టాలెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారు. 

ఈ మేరకు సమంత, మైత్రి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. సమంత రీసెంట్ గా జాను అనే చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం ఆశించిన సక్సెస్ సాధించలేదు.