గద్దలకొండ గణేష్ మూవీ సక్సెస్ తర్వాత హరీష్ శంకర్ తెరకెక్కించే చిత్రంపై ఆసక్తి నెలకొంది ఉంది. హరీష్ శంకర్ వైపు నుంచి మాత్రం తన తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ రావడం లేదు. అయితే చిత్ర పరిశ్రమలో మాత్రం ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్.. మరోమారు పవర్ స్టార్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. 

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాపై 100 శాతం ఆసక్తితో లేడు.అజ్ఞాతవాసి తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాలతో బిజీ అయిపోయాడు. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. 

ఇదే విషయం గురించి పవన్ ని ప్రశ్నించగా.. తాను తిరిగి సినిమాల్లో నటించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పవన్ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పింక్ రీమేక్ తో పాటు, క్రిష్ దర్శత్వంలో ఓ చిత్రానికి, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రానికి అంగీకారం తెలిపినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 

ఇదే కనుక నిజమైతే హరీష్ శంకర్ పింక్ రీమేక్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. హరీష్, పవన్ కాంబోలో చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.