ఇద్దరమ్మాయిలు సినిమాతో వెండితెరకి పరిచయమైన హాట్ హీరోయిన్ క్యాథెరిన్ ట్రెసా ఈ మధ్య కాలంలో సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. ఆ మధ్య నేనే రాజు నేనే మంత్రి - జయ జానకి నాయక వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు మళ్ళీ కనిపించలేదు. రెమ్యునరేషన్ పెంచిందని రూమర్స్ వచ్చాయి.

అందుకే అవకాశాలు తగ్గినట్లు టాక్ వచ్చింది.  అసలు మ్యాటర్ లోకి వెళితే.. నెక్స్ట్ ఈ బ్యూటీ బాబాయ్ అబ్బాయ్ లతో ఒకేసారి రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ - నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమాల్లో బేబీకి అవకాశం దక్కినట్లు సమాచారం. నెక్స్ట్ బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

సింహా - లెజెండ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అనంతరం వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి.  ఇక క్యాథెరిన్ ఆల్ రెడీ బోయపాటి దర్శకత్వంలో సైరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా కనిపించి మంచి క్రేజ్ అందుకుంది. మరోసారి బేబీని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మంచి రోల్ అయ్యింటుంది.

ఇక కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మల్లిడి వేణు డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో క్యాథెరిన్ మెయిన్ లీడ్ లో నటించనుందట. అనుకోని విధంగా బేబీ ఒకేసారి బాబాయ్ - అబ్బాయ్ ల సినిమాల్లో అవకాశం అందుకుంది. ఇక అమ్మడిని గ్లామర్ పాత్ర కోసమే తీసుకుంటారు కాబట్టి తప్పకుండా ఇద్దరి హీరోలతో రొమాన్స్ కూడా చేయనుందని అర్ధమవుతోంది. మరి ఈ కాంబినేషన్స్ తో అమ్మడు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.