కోలీవుడ్ లో అక్టోబర్ 25న దీపావళి హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. విజయ్ బిగ్ బడ్జెట్ మూవీ బిగిల్ - కార్తీ థ్రిల్లర్ మూవీ ఖైదీ బాక్స్ ఆఫీస్ ముందు యుద్దానికి సిద్ధమయ్యాయి. తెలుగులో కూడా అదే రోజు విడుదల కాబోతున్నాయి.

ఈ క్లాష్ ఎలా ఉంటుందో తెలియదు గాని కార్తీ సినిమాకు కాస్త భయం పట్టుకుందనే చెప్పాలి.  ఎందుకంటె బిగిల్ బజ్ తమిళనాట మాములుగా లేదు. 180కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ నాడులో అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. కార్తీ కంటే రెండింతలు ఎక్కువ థియేటర్స్ ని బిగిల్ కబ్జా చేసింది. కానీ ఖైదీ సినిమాను తక్కువంచనా వేయడానికి వీలు లేదు.

సాంగ్స్ రొమాన్స్ లేదంటూనే కార్తీ ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేశాడు, మొదటిరోజు ఏ మాత్రం పాజిటివ్ టాక్ అందుకున్నా పోటీని ఇవ్వవచ్చు.  పైగా విజయ్ కి యాంటీ ఫ్యాన్స్ సంఖ్య కూడా గట్టిగానే ఉంది. వారంతా ఖైదీని హిట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అజిత్ విజయ్ ఫ్యాన్స్ కి ఇటీవల సోషల్ మీడియాలో వివాధాలు ఎక్కువవుతున్నాయి. పోటా పోటీగా హ్యాష్ ట్యాగ్ లను వైరల్ అయ్యేలా చేస్తున్నారు అంటే డోస్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

 కానీ బిగిల్ అట్లీ డైరెక్షన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ ఏ మాత్రం వచ్చినా సౌత్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. దీంతో ఆ ఎఫెక్ట్ ఖైదీ సినిమాపై గట్టిగానే పడుతుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ లో ఎవరు ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటారో చూడాలి.