టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ క్రికెటర్ కోహ్లి (Kohli) ఆటతీరు దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. దీంతో బాలీవుడ్ స్టార్స్ కొహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతంగా ఆడారు. ఆయన ఆటతీరుకు దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఫిదా అయ్యారు. లాస్ట్ ఓవర్లలో కోహ్లీ చూపిన నైపుణ్యానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఖుషీ అయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్వీట్ చేస్తూ.. "క్రికెట్ లోని గొప్ప ఆటను చూడటం చాలా బాగుంది. భారత్ గెలుపొందడం చాలా అద్భుతంగా ఉంది. కోహ్లి బ్యాటింగ్ చూడటం చాలా ఆనందంగానూ ఉంది. అతను ఏడ్చి నవ్వడం చూసి చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. ఈ నేపథ్యం స్కోర్ ఆఫ్ చక్ దే ఇండియా!! హ్యాపీ దీపావళి ఇప్పుడే ప్రారంభమవుతుంది!!’ అంటూ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

అలాగే కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోను షేర్ చేశారు. ‘ఒకే రాజు అది విరాట్ కోహ్లీ మాత్రే. ఈ మ్యాచ్ చాలా అద్భుతమైంది. బాగా ఆడాడు. భారతదేశం నిజంగా దీపావళి పండుగను తీసుకొచ్చాడు. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan) కూడా కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘ఇతంటి ఉత్కంఠ కలిగిన ఆటను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది! విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది’ అని ప్రశ్నించారు. 

అలాగే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఒక చిత్రాన్ని పంచుకున్నాడు. ‘కోహ్లి గురించి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా? #ThankGod ఇది డబుల్ సెలబ్రేషన్.. కోహ్లి లెజెండ్’ అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అలియా భట్ విరాట్ కోహ్లి కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) కూడా కోహ్లీని అభినందించారు. ఈ సందర్భంగా ఫన్నీ రీల్ వీడియోను షేర్ చేశాడు. ‘ఇండియా ఇండియా ఇండియా అన్‌బిలీవబుల్ ఇండియా. ఈ విజయంతో సంతోషకరమైన దీపావళి వచ్చింది. కింగ్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ మ్యాచ్‌లలో ఇదొకటి’ అంటూ ట్వీట్ చేశారు.

View post on Instagram

అదేవిధంగా ఆయుష్మాన్ ఖురానా కూడా టీం ఇండియా గెలుపుపై, కోహ్లీ ఆటతీరుపై సుధీర్ఘమైన నోట్ రాశాడు. ‘నేను ముంబై-చండీగఢ్ ఫ్లైట్‌లో ప్రయాణీకులు సెల్‌ఫోన్‌లకు అతుక్కుని టేకాఫ్ చేయడానికి ముందు చివరి రెండు ఓవర్‌లను చూశాం. క్రికెట్ అభిమాని పైలట్ అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఉద్దేశపూర్వకంగా 5 నిమిషాలు ఆలస్యం చేసాడు. దీనిపై ఎవరూ ఫిర్యాదు లేదు. దీపావళిని ఒక రోజు ముందుగా తీసుకొచ్చినందుకు టీమ్ ఇండియాకు, విరాట్ కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. 

Scroll to load tweet…