నిన్న రిలీజ్ లు ఓపినింగ్స్ , రిపోర్ట్ లు రెండూ రివర్సే
తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తోనే విడుదల అయ్యాయి. అయితే కార్తీ జపాన్ కు ఉన్న క్రేజ్ అయితే జిగర్తాండ కు లేదనే చెప్పాలి.

ఈ శుక్రవారం రెండు తమిళ సినిమాలు జపాన్, జిగర్‌తండా డబల్ ఎక్స్ తెలుగు డబ్బింగ్ లతో థియేటర్స్ లో సందడి చేశాయి. ఈ రెండు సినిమాల ఓపినింగ్స్, రిపోర్ట్ లు విషయంలో ఓ గమ్మత్తు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తోనే విడుదల అయ్యాయి. అయితే కార్తీ జపాన్ కు ఉన్న క్రేజ్ అయితే జిగర్తాండ కు లేదనే చెప్పాలి. దాంతో కార్తి జపాన్ కు డీసెంట్ ఓపినింగ్స్ అంతటా వచ్చాయి. అయితే టాక్ మాత్రం దారుణంగా ఉంది.
ఇక కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraj) దర్శకత్వంలో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా రాఘవ లారెన్స్(Raghava Lawrence), SJ సూర్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ సినిమా కు రివర్స్ లో జరిగింది. సినిమాకు ఓపినింగ్స్ లేవు. కానీ టాక్ చాలా బాగుంది. కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఇలా రెండు సినిమాలు ఓపినింగ్స్ ఒకలా..రిపోర్ట్ లు మరోలా ఉండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచంది.
హీరో కార్తి(Karthi) 25వ చిత్రంగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జపాన్’(Japan) సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ క్లిక్ అవ్వటం, కార్తీకు తెలుగులో క్రేజ్ ఉండటం , ఈ ట్రైలర్ లో లుక్, యాటిట్యూడ్, డైలాగు డెలివరీ డిఫరెంట్ గా ఉండటం ఓపినింగ్స్ తెచ్చిపెట్టింది. ఇక లారెన్స్ హీరోగా వచ్చిన `చంద్రముఖి 2` వర్కవుట్ కాలేదు. దాంతో ఆ సినిమా ఇంపాక్ట్ ...జిగర్తాండ డబల్ ఎక్స్ ఓపినింగ్స్ పై పడింది. అసలు జనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్ బాగుండటంతో పికప్ అవుతోంది.
మరో ప్రక్క ఈ రెండు సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు కార్తీ, రాఘవ లారెన్స్ నెగిటివ్ పాత్రలే. చివర్లో వారిద్దరూ మంచిగా మారతారు. అంతే కాకుండా ఈ రెండు హీరో పాత్రలు కూడా సినిమా క్లైమాక్స్ లో చనిపోతాయి. దీంతో ఈ పాయింట్ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.