సినిమాలు చేస్తూ వార్తల్లో ఉండటం ఓ స్టైల్. అలా కాకుండా కేవలం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ వార్తల్లో నిలవటం లేటెస్ట్ హాట్ భామల స్టైల్. ఇలియానా కూడా ఇదిగో ఇలాంటి స్కీమ్ నే ఫాలో అవుతోంది. ఈ మధ్యన ఆమె వరస పెట్టి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.  ఆ మధ్యన ఫారిన్ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన నటి ఇలియాన..

సినిమాల్ని,సోషల్ మీడియాని సైతం పెద్దగా పట్టించుకున్నది లేదు. అయితే  ప్రియుడితో బ్రేకప్ అయ్యాక.. డిప్రెషన్ లోకి వెళ్లింది. అయితే అందులోంచి నుంచి బయటపడేందుకు.. తానకెంతో ఇష్టమైన గ్లామర్ ఫీల్డ్ లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అందుకోసం తన హాట్ ఫొటోలును బయిటకు తీసి జనాల మధ్య చర్చకు పెడుతోంది.ఇటీవల కాలంలో ఇలియాన  ఇన్ స్టా అకౌంట్ ను చూస్తే.. ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు చూస్తే.. ఇప్పటి యంగ్ హీరోయిన్స్ కు  ఏ మాత్రం తీసిపోని అందం తన సొంతమని.. వయసు మీద పడొచ్చు కానీ..ఛార్మ్ మాత్రం ఏ మాత్రం మిస్ కాలేదన్న విషయాన్ని తన ఫోటోలతో చెప్పేసిందంటున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Felt marginally attractive. Might not delete later.

A post shared by Ileana D'Cruz (@ileana_official) on Dec 30, 2019 at 12:47pm PST

కాకపోతే కొందరు మాత్రం అవి పాత ఫొటోలని, ఇప్పుడు ఇలియానా ని చూసిన వారు ఇట్టే గుర్తించేస్తారని అంటున్నారు.    అప్పట్లో ఆమె బయిట పెట్టకుండా దాచిన ఫొటోలను ఇప్పుడు తెలివిగా అప్ లోడ్ చేస్తోందిని చెప్తున్నారు. ఇలియానా ఇంకా చబ్బిగానే ఉందని..వయస్సు ముఖంలోనే కనపడిపోతోందని, నడుము కూడా అంతకు ముందు లా లేదని ,ఆంటీ లుక్ వచ్చేసిందని తెలిసిపోయంది.

బోయ్ ఫ్రెండ్ తో కలిసి..లేట్ నైట్ పార్టీలు, ఫుడ్ ఆమెను ఇలా మార్చేసాయని బాలీవుడ్ గుసగుసలాడుతోంది.  ఆమె ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే... రైడ్‌లో అజయ్‌ సరసన హీరోయిన్‌గా నటించిన ఇలియానాయే మళ్లీ రైడ్‌ సీక్వెల్ లోనూ నటించబోతున్నారని బాలీవుడ్‌ సమాచారం. 1980 నేపథ్యంలో అప్పటి వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో ‘రైడ్‌’ చిత్రం తెరకెక్కింది. తాజాగా మరో భారీ ఐటీ రైడ్‌ నేపథ్యంలో ‘రైడ్‌’కు సీక్వెల్‌ తీయాలనే ఆలోచనలో ఉన్నారట అజయ్‌ దేవగన్‌. ఇందుకు తగిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.