పోకిరి చిత్రం తర్వాత ఇలియానా తెలుగు యువత కలల రాణిగా మారిపోయింది. పోకిరి చిత్రం తర్వాత యువత అంతా ఇలియానా జపం చేశారు. పోకిరి బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఇలియానా మారిపోయింది. వరుసగా బడా హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. 

చాలా రోజుల పాటు టాలీవుడ్ లో ఇలియానా హవా సాగింది. కొంత కాలానికి ఇలియానా బాలీవుడ్ బాట పట్టింది. కానీ బాలీవుడ్ లో ఇలియానాకు అంతగా కలసి రావడం లేదు. అలాగే ఆమె ప్రేమ కూడా బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. తిరిగి కోలుకున్నాక మళ్ళీ సినిమాలపై ద్రుష్టి పెట్టింది. 

ఇటీవల ఇలియానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ తాను అంతగా సక్సెస్ కాకపోవడానికి కొన్ని కారణాలు వివరించింది. పోకిరి ఘనవిజయం తర్వాత ఆ చిత్రాన్ని వాంటెడ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. వాంటెడ్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ మూవీలో సల్మాన్ ఖాన్ కు హీరోయిన్ గా మొదట నన్నే అడిగారు. 

కానీ ఆ సమయంలో నేను పరీక్షలు రాస్తూ బిజీగా ఉన్నా. దీనితో వాంటెడ్ చిత్రాన్ని రిజెక్ట్ చేశా. మరోసారి సల్మాన్ తో నటించే అవకాశం వచ్చింది. కిక్ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రంలో కూడా హీరోయిన్ గా నన్నే అనుకున్నారు. కానీ ఆసమయంలో నేను బిజీగా ఉండడం వాళ్ళ డేట్స్ కుదర్లేదు. నాకు మాత్రం సల్మాన్ ఖాన్ తో నటించాలనే కోరిక ఉండేది. కానీ కుదర్లేదు అని ఇలియానా తెలిపింది. 

ఆ రెండు చిత్రాల్లో నటించి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని ఇలియానా తెలిపింది. ఇలియానా తెలుగులో మహేష్, ఎన్టీఆర్, పవన్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్ అందరితో నటించింది.