టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ ఇలియానా ఇటీవల పూర్తి ఫాం కోల్పోయింది. బాలీవుడ్ మీద ఆశలతో తెలుగు సినిమాను నిర్లక్ష్యంతో చేయటంతో ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. బాలీవుడ్‌లో కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవటంతో ఇలియానా కెరీర్‌ పరంగా వెనకపడింది. తరువాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించినా పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు. రవితేజ సరసన హీరోయిన్‌గా నటించిన అమర్‌ అక్బర్‌ ఆంటోని కూడా ఫెయిల్ కావటంతో తెలుగులో కెరీర్ ముందుకు సాగలేదు.

అయితే సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. బీచ్‌లో బికినీతో సేద తీరుతున్న ఫోటలతో పాటు తన డెయిలీ యాక్టివిటీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఇలియానా. తాజాగా ఈ భామ ఓ ఇంట్రస్టింగ్ కామెంట్‌ ను పోస్ట్ చేసింది. డల్‌ ఫేస్‌తో ఉన్న తన ఫోటోతో పాటు ఈ కామెంట్ చేసింది.

`జీన్స్ వంక అలా చూస్తుంటాను.. నేను ఆ జీన్స్‌లో ఎలా పట్టేదాన్నో అని.. ఒక్కోసారి కన్నీరు కూడా వచ్చేది` అంటూ కామెంట్ చేసింది ఇలియానా. ఈ కామెంట్‌కు దాదాపు 9 లక్షలకు పైగా లైక్స్‌ రావటం విశేషం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

How I look at the jeans I used to fit into. Sometimes with a few tears.

A post shared by Ileana D'Cruz (@ileana_official) on May 5, 2020 at 3:05am PDT