వికాస్ గుప్తా నిజాయితీపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన చాలా ధైర్యంగా నిజాన్ని అంగీకరించారని.. ఆయనను ఎవరు ఎగతాళి చేయోద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాను బై సెక్సువల్( ద్వి లింగ సంపర్కుడు) అంటూ బాలీవుడ్ నటుడు, నిర్మాత వికాస్ గుప్త ప్రకటించారు. ఇంతకాలం తాను ఈ విషయాన్ని దాచి పెట్టానని.. ఇకపై ఈ విషయాన్ని దాచాలని అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
‘‘నేను స్త్రీ , పురుషులలో ఎవరితోనైన ప్రేమలో పడతాను. నాలాంటి వారు ఎందరో ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి నేను గర్వంగా ఫీలవుతున్నాను . బెదిరింపుల వలన ఈ విషయం నేను చెప్పడం లేదు’’ అంటూ వికాస్ గుప్తా ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనితో పాటు తన ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది.
వికాస్ గుప్తా నిజాయితీపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన చాలా ధైర్యంగా నిజాన్ని అంగీకరించారని.. ఆయనను ఎవరు ఎగతాళి చేయోద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే బైసెక్సువల్ వలన తాను ఎన్నో ఇబ్బందులు పడ్డట్టు వికాస్ పేర్కొన్నారు. తన ప్రవర్తన చూసి తన ఫ్యామిలీ ఎన్నో అవమానాలు ఎదుర్కొందని ఆయన వివరించారు. ఆకరికి తన తల్లి కూడా తనను అసహ్యించుకుందని చెప్పారు.
తనను అవమానించిన వారిని కూడా తాను ప్రేమిస్తానని చెప్పారు. వారిని గర్వంగా తలెత్తుకునేలా చేస్తానని ప్రకటించారు. పార్థ్‌సంతాన్, ప్రియాంక శర్మలకు ధన్యవాదాలు తెలిపారు. వారు నాకు చేసిన అవమానాల వల్ల తాను మరింత శక్తివంతంగా తయారయ్యానని వెల్లడించారు. దేవుడు ఎలా సృష్టించారో తాను అలా మారనని చెప్పారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
