బాలీవుడ్ ప్రముఖ నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నవాజుద్దీన్ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. అవసరమైతే కామెడీ పండించడంలో కూడా దిట్ట. నటుడిగా నవాజుద్దీన్ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఆయన వ్యక్తిగత జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. 

తాజాగా నవాజుద్దీన్ సిద్దిఖీ సతీమణి ఆలియా సిద్దిఖీ తనకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కారు. నవాజుద్దీన్ కు నోటీసులు కూడా పంపారు. విడాకుల వ్యవహారంపై ఆలియా, ఆమె లాయర్ మీడియాతో మాట్లాడారు. అలియా మాట్లాడుతూ.. తమ వివాహం 2009లో జరిగింది. ఏడాది నుంచి తమ మధ్య విభేదాలు మొదలయ్యాయి. 

ఈ మామధ్య ఏ సందర్భంలోనూ సఖ్యత కుదర్లేదు. నేను బయటకు చెప్పుకోలేని దారుణాలు చాలానే జరిగాయి. ఈ రెండు నెలల్లో  జీవితం గురించి బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చాను. వైవాహిక జీవితంలో ఆత్మగౌరవం కూడా చాలా ముఖ్యం. ఎవ్వరూ భరించలేని భాదలు అనుభవించా. నా భర్త తమ్ముడు షామస్ కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. 

ఇకపై నా అసలైన పేరు అంజనానే ఉపయోగిస్తాను. ఒక్కరివల్ల వచ్చిన  ఐడెంటిటీ నాకు అవసరం లేదు అని ఆలియా తెలిపింది. నా భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించలేదు. కానీ ఈ వైవాహిక జీవితం నాకు అవసరం లేదు. ఇకపై కూడా నేను పెళ్లి చేసుకోను. 

నా పిల్లలు నానా వద్దే ఉంటారని ఆశిస్తున్నా అని అలియా పేర్కొంది. ఆమె లాయర్ మాట్లాడుతూ విడాకుల నోటీసులు నవాజుద్దీన్ కు ఈమెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ లో పంపలేదని అన్నారు. వీలైనంత త్వరగా నవాజుద్దీన్ స్పందించాలని కోరారు.