కరోనా వైరస్ జబర్దస్త్ షోను వదల్లేదంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోలో నవ్వులు పూయించే హైపర్ ఆది టీమ్‌ను కరోనా కలవరపెడుతోందని ఆ వార్తలు సారాంశం. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పునః ప్రారంభమైన జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోను కరోనా వైరస్ వెంటాడుతోంది. సిబ్బంది అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా భయాందోళనలకు గురిచేస్తోందంటున్నారు.

ఆ నేపధ్యంలో నటుడు హైపర్ ఆది కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ వార్త నిజమేనా అంటూ ఆదికి టీవి ఇండస్ట్రీ నుంచి, అభిమానుల నుంచి, సినిమావాళ్ల నుంచీ ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట. అయితే ఆదికు కరోనా రాలేదని తెలుస్తోంది. మరి ఆ వార్త ఎలా మొదలైందంటే.

హైపర్ ఆది టీమ్‌లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకిందని అనుమానం వచ్చింది. ముందు కాస్త జ్వరంగా అనిపించడంతో సదరు వ్యక్తి టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్‌ రిజల్ట్ ఇంకా రాలేదు. అంతకుముందే హైపర్ ఆది ఆ టీమ్‌తో కలిసి పనిచేసినట్టు తెలిపాడు. దాంతో హైపర్ ఆది టీమ్ హోమ్ క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు. జబర్దస్త్ నిర్వాహకులు షోను మరలా కొన్ని రోజుల వరకు ఆపేశే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రజలను ఎంతగానో అలరించే ప్రోగ్రామ్ జబర్దస్త్‌ టీమ్‌ను కరోనా పలకరించడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.