టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నట్టికుమార్ తన కొడుకు విషయంలో వార్తల్లోకెక్కారు. తన కొడుకు క్రాంతిపై పోలీసులు అనవసరంగా దాడికి దిగారని నట్టికుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. న్యూఇయర్ సెలెబ్రేషన్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

బేగం పేట కంట్రీ క్లబ్ వద్ద న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఈ సెలెబ్రేషన్స్ లో నట్టికుమార్ తనయుడు క్రాంతి కూడా పాల్గొన్నాడు. క్రాంతి కారు కనిపించకపోవడంతో 100కు డయల్ చేసి సాయం చేయాలని పోలీసులని కోరాడు. సాయం చేయమని అడిగినందుకు తన కుమారుడిపై దాడి చేస్తారా అంటూ నట్టికుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

మతిపోగొట్టే సొగసు.. ప్రియమణి గ్లామర్ కి ఫిదా(ఫొటోస్)

అనంతరం పోలీసులు నట్టికుమార్ కు క్షమాపణలు చెప్పారు. దీనితో ఆయన శాంతించి తన కుమారుడిని తీసుకెళ్లారు. కంట్రీ క్లబ్ మేనేజర్ సుమన్ పెద్ద ఎత్తున న్యూఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుతున్నట్లు నమ్మించి చాలా మందిని మోసం చేశారని నట్టికుమార్ ఆరోపించారు. 

మహేష్ బాబు, విజయశాంతి కనిపిస్తే అంతే.. ట్రైన్ లో 30 నిమిషాలు!

కంట్రీ క్లబ్ వద్ద తన కుమారుడి కారు పార్క్ చేస్తామని చెప్పి కీ తిరిగి ఇవ్వలేదు. అలాగే కారు కూడా కనిపించలేదు. అందుకే తన కుమారుడు 100కు ఫోన్ చేశాడని అన్నారు. హైదరాబాద్ నగరంలో న్యూఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున పెట్రోలింగ్ నిర్వహించారు. నట్టికుమార్ తెలుగులో చట్టం, అడవి, యుద్ధం లాంటి చిత్రాలు నిర్మించారు.