1965 కాలానికి చెందిన జార్జ్ రెడ్డి గురించి ప్రస్తుత తరానికి తెలిసింది చాలా తక్కువ. జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఉద్యమ నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. యువతలో ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. 

ఉద్యమాల్లో పోరాడుతూ ఎంతోమందికి జార్జ్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. చిన్న వయసులోనే ఆయన్ని కొందరు ప్రత్యర్థులు హత్య చేశారు. జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది. జార్జ్ రెడ్డి అనే టైటిల్ తోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

యువ నటుడు సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. జీవన్ రెడ్డి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఉంది. ఉద్యమ నాయకుడి జీవిత చరిత్ర కావడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మూవీకి తన సపోర్ట్ తెలిపారు. 

ట్రైలర్ విడుదలైన అనంతరం దర్శకుడిని అభినందించారు. దీనితో చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ ని ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా ఆహ్వానించగా అందుకు ఆయన ఓకె చెప్పారు. నవంబర్ 17న జార్జ్ రెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తుండగా ఊహించని షాక్ ఎదురైంది. 

జార్జ్ రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీలు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎందుకు అనుమతి నిరాకరించారో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

చిత్ర యూనిట్ మరోసారి పోలిసుల అనుమతి కోరుతుందా, ప్రీ రిలీజ్ ని వాయిదా వేస్తుందా అనేది వేచి చూడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జార్జ్ రెడ్డి గురించి పవన్ ఎం మాట్లాడతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశకలిగించే వార్తే.