సూర్య ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉన్న హీరో. ఆయనకు తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ మార్కెట్ ఉంది. అయితే గత కొద్ది కాలంగా వరస డిజాస్టర్స్ ఆయన్ని ట్రాక్ తప్పించాయి. ఏ దర్శకుడుతో చేసినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యిపోతోంది. రీసెంట్ గా వచ్చి బందోబస్తు సినిమా సైతం భారీ నష్టాలనే మిగిల్చింది. ఈ నేపధ్యంలో సూర్య సినిమాకు రిలీజ్ కు ముందే క్రేజీ బిజినెస్ అవటం అనేది చాలా చాలా కష్టం. కానీ ఆ ఫీట్ జరిగింది. తమిళ సినీ పరిశ్రమ ముక్కున వేలేసుకునే స్దాయిలో ఆయన తాజా చిత్రానికి బిజినెస్ జరిగి ఆశ్చర్యపరిచింది.

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సూర్య  తాజా చిత్రం ఆకాశమే నీ హద్దు రా.. సినిమా కు భారీ క్రేజ్ వచ్చింది. మహిళా దర్శకురాలు సుధా కొంగర డైరక్షన్ లో వస్తున్న ఈ చిత్రం 15 కోట్ల లిమిటెడ్ బడ్జెట్ లో చేసారు. కానీ బయ్యర్లు ఎగబడి ఈ సినిమాని 40 కోట్లు దాకా కొనేసారు. దాంతో పెట్టిన పెట్టుబడికు దాదాపు మూడు రెట్లు లాభం వచ్చింది. దాంతో నిర్మాతలు ఖుషీగా ఉన్నారు. సూర్య సైతం ఈ ప్రాజెక్టుని ప్రెస్టేజియస్ గా భావించి చాలా ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే క్రేజ్ రావటంతో చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు. సినిమా టీమ్ అందరికీ ప్రత్యేకమైన ట్రీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తమిళంలో ‘సూరారై పొట్రు’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం  తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులో అనువాదం అవుతున్న ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకురాలు మరెవరో కాదు... ఆ మధ్యన వెంకటేష్ తో గురు మూవీ తీసి మంచి హిట్ అందుకున్న దర్శకురాలు సుధా. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ని ఈ సినిమా కథగా ఎంచుకున్నట్లు టాక్. సూర్య ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని శ్రీనికిత్ బొమిరెడ్డి అందిస్తున్నారు.  

సూర్య సొంత బ్యానరైన 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ప్రొడక్షన్ నెంబర్ 6 గా రూపొందుతున్న ఈ సినిమాలో కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమారి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను మార్చి లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.!!