Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ 152 కోసం మరొక భారీ సెట్.. 20కోట్లా?

చిరంజీవి నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. వరుస సక్సెస్ లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను అందుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ 152వ సినిమా కోసం అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

huge cost for megastar chiru 152 project sets
Author
Hyderabad, First Published Feb 1, 2020, 9:02 PM IST

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. వరుస సక్సెస్ లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను అందుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ 152వ సినిమా కోసం అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

huge cost for megastar chiru 152 project sets  

అయితే నేడు సినిమాకు సంబందించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో సెట్స్ కోసమే దర్శకుడు ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.  చూస్తుంటే సినిమా బడ్జెట్ 150కొట్లను దాటేలా కనిపిస్తోంది. కేవలం ఒక కాలనీ సెట్ కోసమే 20కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారట. అలాగే సినిమాలో ఒక టెంపుల్ కూడా చాలా కీలకమైనది కావడంతో అందుకు సంబందించిన సెట్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారట.

huge cost for megastar chiru 152 project sets  

దర్శకుడు కొరటాల ఎంత ఖర్చు చేసినా కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా మంచి లాభాలని అందిస్తాడని నిర్మాత రామ్ చరణ్ కాస్ట్ దగ్గర వెనుకాడడం లేదు. మరీ ఇంతలా అంచనాలకు మించి నిర్మిస్తున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

huge cost for megastar chiru 152 project sets

కొరటాల ఒక ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్లు టాక్ వస్తోంది. సినిమా సెకండ్ హాఫ్ లో కథను మలుపు తిప్పే ఒక బలమైన పాత్ర కోసం ఒక స్ట్రాంగ్ లేడి క్యారెక్టర్ అవసరం పడిందట. దీంతో విజయశాంతి అయితే బెటర్ అని చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios