Asianet News TeluguAsianet News Telugu

వార్ హీరోల బాక్స్ ఆఫీస్ రికార్డ్.. ఫాస్టెస్ట్ 100

హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ నెల 2న వరల్డ్ వైడ్ గా రిలీజైన వార్ ముడురోజుల్లోనే 100కోట్ల భారీ వసూళ్లను సాధించి హీరోల కెరీర్ లొనే బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

hrithik roshan war movie latest box office collections
Author
Hyderabad, First Published Oct 6, 2019, 12:44 PM IST

యాక్షన్ హీరోస్ హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ నెల 2న వరల్డ్ వైడ్ గా రిలీజైన వార్ ముడురోజుల్లోనే 100కోట్ల భారీ వసూళ్లను సాధించి హీరోల కెరీర్ లొనే బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నాలుగురోజుల్లో 128కోట్లు వచ్చినట్లు సమాచారం. సినిమాను నిర్మించిన యష్ రాజ్ ఫిలిమ్స్ కి కూడా ఈ సినిమా బెంచ్ మార్క్ అనే చెప్పాలి.

గతంలో ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన నాలుగు సినిమాలు మూడు రోజుల్లోనే 100కోట్ల కలెక్షన్స్ ని సాధించాయి. ఇక ఇప్పుడు వార్ సినిమా కూడా విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని భాషల్లో కలుపుకొని 100కోట్లకు పై కలెక్షన్స్ ని రాబట్టి మరో బిగ్ హిట్ ని అందించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ లో కూడా మరింత లాభాలు అందుకునే అవకాశం ఉంది. పోటీగా పెద్ద సినిమాలు కూడా లేకపోవడం సినిమాకు కలిసొచ్చే అంశం. 

అయితే మల్టిప్లెక్స్ లలో హాలీవుడ్ జోకర్ సినిమా వార్ కు పోటీని ఇస్తోంది. అయినా కూడా వార్ వెనక్కి తగ్గడం లేదు. ఈ దసరా హాలిడేస్ సినిమ కలెక్షన్స్ కి బూస్ట్ ఇవ్వనున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది. మొత్తానికి చాలా కాలం తరువాత టైగర్ ష్రాఫ్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ ఏడాది 'సూపర్ 30'తో సక్సెస్ అందుకున్న హృతిక్ ఇప్పుడు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios