చాలా రోజులు కిందటే క్రిష్ 4 రెడీ అవుతుందని చెప్పాడు దర్శకుడు రాకేష్ రోషన్‌. కానీ అదే సమయంలో రాకేష్ రోషన్‌ క్యాన్సర్ బారిన పడటంలో ప్రాజెక్ట్ వాయిదా పడింది. సినిమా సెట్స్ మీదకు వస్తుందనుకుంటున్న తరుణంలో లాక్‌ డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. అయితే అసలు ప్రాజెక్ట్‌ ఉంటుందా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు రాకేష్‌.

హాలీవుడ్‌ లో సూపర్‌ హీరోల కథలకు మంచి ఆధరణ ఉంది. సూపర్‌ మేన్‌, స్పైడర్‌ మేన్‌, బ్యాట్‌ మేన్‌, అవెంజర్స్‌ లాంటి సూపర్‌ హీరోల చిత్రాలు అక్కడ చాలానే వచ్చాయి. ఒకే పాత్రకు కొనసాగింపుగా వరుసగా సినిమాలు చేయటం హాలీవుడ్‌ లో తరచూ చూస్తుంటాం. కానీ ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి చిత్రాలు చాలా అరుదు. అలాంటి అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకున్న సిరీసే క్రిష్.

ఒక రకంగా క్రిష్ తొలి ఇండియన్‌ సూపర్‌ హీరో సినిమా అని కూడా చెప్పోచ్చు. గతంలో సూపర్‌ మేన్ కథలు ఇండియాలో వచ్చిన వాటికి కొనసాగింపులు మాత్రం రాలేదు. కానీ క్రిష్ అలా కాదు. కొయి మిల్‌ గయా సినిమాను ఓ మామూలు కమర్షియల్‌ మూవీగానే తెరకెక్కించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో దానికి కొనసాగింపుగా క్రిష్ సినిమాను తెరకెక్కించారు. అది కూడా సక్సెస్‌ కావటంతో క్రిష్ 3 రూపొందింది. అప్పటి నుంచి క్రిష్ 4 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

చాలా రోజులు కిందటే క్రిష్ 4 రెడీ అవుతుందని చెప్పాడు దర్శకుడు రాకేష్ రోషన్‌. కానీ అదే సమయంలో రాకేష్ రోషన్‌ క్యాన్సర్ బారిన పడటంలో ప్రాజెక్ట్ వాయిదా పడింది. సినిమా సెట్స్ మీదకు వస్తుందనుకుంటున్న తరుణంలో లాక్‌ డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. అయితే అసలు ప్రాజెక్ట్‌ ఉంటుందా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు రాకేష్‌. ఇప్పటికే క్రిష్ 4 కథ ఫైనల్‌ అయ్యిందని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుతం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందని, లాక్‌ డౌన్‌ తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పాడు. అంటే వచ్చే ఏడాదిలో ఇండియన్ సూపర్‌ హీరో మరోసారి వెండితెర మీద సందడి చేయనున్నాడన్న మాట.