లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచమంతా స్థంభించి పోయింది. సాధారణ ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారి ఇళ్లలో జరిగాల్సి వేడుకలు కూడా ఆగిపోయాయి. అయితే అలా లాక్ డౌన్‌ కారణంగా సన్నిహితులతో కలిసి వేడుకలు జరుపుకోవాలనుకున్నవారికి హృతిక్ రోషణ్ సోషల్ మీడియా ద్వారా ఓ ఐడియా ఇచ్చాడు హృతిక్‌.

ఆదివారం ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు హృతిక్‌. తన మాజీ భార్య సుసానే ఖాన్‌తో కలిసి కొడుకు హ్రీహాన్  బర్త్ డే ను ఎలా సెలబ్రేట్ చేసిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. లాక్ డౌన్‌ కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో సుసానే, హృతిక్‌ ఇంట్లోనే ఉంటుంది. 21 రోజుల పాటు పిల్లలకు దూరంగా ఉండటం ఇష్టం లేక మాజీ భర్త ఇంట్లో ఉండేందుకు నిర్ణయించుకుంది సుసానే.

ఈ జంట తమ కుమారుడు హ్రీహాన్‌ బర్త్‌ డేను సెల్ఫ్‌ ఐషోలేషన్‌ లో భాగంగా ఇంట్లోనే సెలబ్రేట్ చేశారు. హ్రీహాన్‌ శనివారం 14వ ఏట అడుగుపెట్టాడు. దీంతో హృతిక్‌ తల్లి దండ్రులు రాకేష్‌, పింకీ రోషన్‌.. చెల్లెలు సునైనా, పాశ్మినా.. కోడలు సురానిఖా తో పాటు మరికొందరు బందువులు వీడియో కాల్‌లో ఉండగా హ్రీహాన్‌ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు

ఈ వీడియోలో హృతిక్‌, సుసానే ఇద్దరు పిల్లలతో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించటంతో ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. వీడియోతో పాటు `మార్చి 28, 2020 హ్రీహన్‌ పుట్టిన రోజు. సాంకేతికతకు కృతజ్ఞతలు. మంచి రోజులు వస్తాయి` అంటూ కామెంట్ చేశాడు హృతిక్‌ రోషన్‌.