బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన సెలెబ్రిటీస్ బ్రేకప్స్ లో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ ల జంట కూడా ఒకటి. హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ 2000 సంవత్సరంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అనూహ్య పరిణామాలతో సుసాన్నె, హృతిక్ విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

హృతిక్ రోషన్ జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రేమ వ్యవహారానికి సంబంధించి కంగనా రనౌత్, హృతిక్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఆ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ఇటీవల కొంత కొంత కాలంగా హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసాన్నెతో సన్నిహితంగా మెలుగుతున్నారు. 

విడిపోయిన తర్వాత వీరిమధ్య మరోసారి స్నేహం చిగురించింది. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ పిల్లల కోసం స్నేహంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో వీరిద్దరూ మళ్ళీ ఒక్కటి కాబోతున్నారని, విడాకులు రద్దు చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. 

తాజాగా ఈ జంట మరోసారి మీడియా ముందు మెరిశారు. ముంబైలో జరిగిన యు 2 ముంబై కన్సర్ట్ కార్యక్రమానికి హృతిక్, సుసాన్నె తమ ఇద్దరి పిల్లలతో కలసి వచ్చారు. ఆ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ జంట మళ్ళీ ఒక్కటి కావాలని హృతిక్ స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఆ మధ్యన సుసాన్నె ఖాన్ తండ్రి మాట్లాడుతూ నా అల్లుడిపై నాకు ఎప్పటికి గౌరవం ఉంటుంది అని.. వారిద్దరూ బావుండాలనేదే తన కోరిక అని కామెంట్ చేశారు. 

మరి ఇప్పటికైనా హృతిక్, సుసాన్నె ఒక్కటవుతారా లేక ఇలాంగే ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.