దీపావళి సందర్బంగా వరసగా సినిమావాళ్లు పోస్టర్స్ ,టీజర్స్, ట్రైలర్స్ వదులుతున్నారు. మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరునీకెవ్వరు నుంచి ఇప్పటికే రెండు ఇంట్రస్టింగ్ పోస్టర్స్ వచ్చాయి. మహేష్ బాబు బైక్ పై వెళ్తున్నది, విజయశాంతి లుక్. అయితే తాజాగా రష్మిక లుక్ వదిలారు. ఈ లుక్ లో రష్మిక చాలా క్యూట్ గా ఉంది. చాలా ఫన్నీగా ఉంది. మహేష్ బాబుని చాలా టీజ్ చేస్తున్నట్లే ఉంది.

నేనూ నా ఫ్యామిలీ నన్ను చూడటానికి వచ్చిన 101 నవ పెళ్లికొడుకుని ఎలా హ్యాండిల్ చేస్తామో అని అర్దం వచ్చేలా రాసి ఈ పోస్టర్ ని షేర్ చేసింది.  ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ గా మారింది. మహేష్ అభిమానులు నవ్వుతూ ఉన్న మహేష్ ఫొటో చూసి మరుసిపోతూ షేర్ చేస్తున్నారు. మరి మీరూ ఓ లుక్కేయండి.

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’‌. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా విడుదలకానుంది.