సాధారణంగా ఒక సినిమా రిజల్ట్ ఏమిటో మొదటి రోజే అర్థమైపోతుంది. లక్కు పీక్స్ లో ఉంటే తప్ప నెగిటివ్ టాక్ అందుకున్న సినిమాలు పెద్దగా లాభాల్ని అందుకోలేవు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓక బాలీవుడ్ సినిమా 150కోట్లవరకు కలెక్షన్స్ ని రాబట్టింది.

ఆ సినిమా మరేదో కాదు. అక్షయ్ కుమార్ కామెడీ మూవీ హౌజ్ ఫుల్ 4. గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అని మొదటిరోజు టాక్ బాగా వైరల్ అయ్యింది.  సీనియర్ క్రిటిక్స్ కూడా సినిమాకు 1.5 రేటింగ్ ఇవ్వడం చూశాక సినిమా పోయినట్లే అని అందరు ఫిక్స్ అయ్యారు.

రివ్యూలు ఎంత నెగిటివ్ గా వచ్చినా ఆడియెన్స్ వాటిని లెక్కచేయరు అని ఈ సినిమా నిరూపించింది. హౌజ్ ఫుల్ 4 వీకెండ్ లోనే ఆఫ్ సెంచరీ కొట్టేసి ఆ తరువాత 100కోట్లను కూడా ఫాస్ట్ గా అందుకుంది. ఇక ఇప్పుడు 150కోట్లవరకి రాబట్టినట్లు తెలుస్తోంది.

గత నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ఎవరు ఊహించలేదు.  మొత్తానికి అక్షయ్ కుమార్ తన స్టామినాతో సినిమా కలెక్షన్స్ ని పెంచాడు. ఇక రితేష్ దేశముఖ్ - పూజ హెగ్డే సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా హిట్ కావాలని అందరికంటే ఎక్కువగా పూజ హెగ్డే ఆశపడింది.

బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్న పూజకి ఈ సినిమా కమర్షియల్ గా మంచి బాట వేసిందని చెప్పవచ్చు. డిజాస్టర్ టాక్ తో కూడా హీరోయిన్ మంచి హిట్ అందుకుందని మరికొన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా అమ్మడు ఆచితూచి అడుగు వేస్తున్నట్లు సమాచారం.