రాధికా ఆప్టే రక్తచరిత్ర చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ చిత్రం రాధికకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆయా తర్వాత రాధికా బాలయ్య సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాక రాధికా ఆప్టే బాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. 

కానీ రాధికకు బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు. అయినా కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అప్పుడప్పుడూ కొన్ని సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా రాధికా ఆప్టే తన పెళ్లి నాటి సంగతులని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. 

రాధికా ఆప్టే హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే వివాహం చేసుకుంది. 2012లో రాధికా లండన్ కు చెందిన బెన్ డిక్ట్ టేలర్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తన పెళ్లి కోసం ఆఖరికి చిరిగిపోయిన చీరని ధరించానని రాధికా ఆప్టే చెబుతోంది. 

ఆమె వద్ద చీర కొనుక్కునే డబ్బులు కూడా లేక కాదు.. దానికి ఓ కారణం ఉంది. తన పెళ్ళిలో రాధికా ఆప్టే ధరించిన చీర వాళ్ళ అమ్మమ్మదట. తనకెంతో ఇష్టమైన అమ్మమ్మ చీర కట్టుకుని వివాహాం చేసుకున్నట్లు రాధిక తెలిపింది. అందుకే ఆ చీర చిరిగిపోయి ఉన్నా పట్టించుకోలేదు. 

తన మ్యారేజ్ రిసెప్షన్ రోజున 80 మంది చేత మామిడి మొక్కలు నటించినట్లు రాధికా ఆప్టే తెలిపింది. త్వరలో వారందరికీ మామిడి పండ్లు కూడా పంపిస్తుందట.