Asianet News TeluguAsianet News Telugu

జోరుగా ‘ది గ్రే మ్యాన్’ ప్రమోషన్స్.. తమిళ స్టార్ ధునుష్ పై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు.. మళ్లీ కలిసి పనిచేస్తాం

తమిళ స్టార్ హీరో ధనుష్ గతంలోనే హాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా మరో ఇంగ్లీష్ ఫిల్మ్ ‘ది గ్రే మాన్’తో అలరించనున్నాడు. ఈ రోజు మూవీ రిలీజ్ అవుతుండగా.. హాలీవుడ్ మేకర్స్ ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
 

Hollywood film The Gray Man  promotions, Makers praise Tamil star Dhunush
Author
Hyderabad, First Published Jul 22, 2022, 2:20 PM IST

స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఇండియన్ ఫిల్మ్స్ తోనే కాకుండా హాలీవుడ్ ఫిల్మ్స్ లోనూ నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటున్నాడు. వరుస చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.  గతంలోనే ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ మూవీతో  హాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. తాజాగా ‘ది గ్రే మాన్’ (The Gray Man)తో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాడు.  నెట్ ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ  సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది.

హాలివుడ్ యాక్షన్ దర్శకులు రూసో బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్‌ కోసం తెరకెక్కించిన సినిమా 'ది గ్రే మ్యాన్', ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా 'ది గ్రే మాన్' దర్శకులు, ధనుష్ తో ముంబై లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా  ఇండియాపై, ధనుష్ పై హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రూసో బ్రదర్స్ తమకున్న అభిమాన్ని వ్యక్త పరిచారు. ‘ఇండియా లో సినిమాలకు అందే ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యమేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి సినీ ప్రేక్షకుల కోసం 'ది గ్రే మాన్' ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం లో ధనుష్ యాక్షన్ మీకు చాలా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అతనంటే మాకు అమితమైన అభిమానం, గౌరవం ఉంది. వీలైతే భవిష్యత్ లో మళ్ళీ కలిసి పని చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. 

అనంతరం ధనుష్ మాట్లాడుతూ.. ‘ది గ్రే మాన్’ షూటింగ్ లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా రూసో బ్రదర్స్ వల్ల చాలా విషయాల తో పాటు కొన్ని పరిస్థితుల్లో పూర్తి ఓపిగ్గా ఉండడం నేర్చుకున్నాను. ఇదొక అద్భుతమైన అవకాశం, ప్రతీ క్షణాన్ని ఆనందిస్తూ పని చేశాను. కొత్తగా చేయటం, కొత్త విషయాలు నేర్చుకోవటమే నాకు అలవాటు. ఇలాంటి మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ వారి ప్రశంసలకు బదులిచ్చాడు. 

ఈ చిత్రం జూలై 22న (ఈరోజు) నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో క్రిస్ ఇవాన్స్, అనాడి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. మార్క్ గ్రీన్ రాసిన 'ది గ్రే మ్యాన్' పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూసో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందించారు. సినిమాకు తగ్గట్టుగా జో రుసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్ ఫీల్ స్క్రిప్ట్ రాశారు. నిర్మాతలు : జో రోత్, జెఫరీ కిర్స్ చెన్ బామ్, ఆంథోని రుసో, జొ రుసొ, మైక్ లారొక్కా, చిరిస్ కాస్టాల్డి మూవీని రూ.200 కోట్లతో నిర్మించారు. ఈ ప్రమోషన్స్ లో విక్కీ కౌశల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా హాజరయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios