కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ గజగజ లాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతుండగా వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి మరి వారికి సేవలందిస్తున్నారు. అయితే ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉండటంతో వైద్య పరికరాలు, మాస్క్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు మెడికల్ మాస్క్‌లు వినియోగించకుండా వాటిని వైద్య సిబ్బంది అందేలా చూడాలని సెలబ్రిటీలు కోరుతున్నారు.

ప్రజలు ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులు లేదా హ్యాండ్ కర్చీఫ్‌లు వాడుకోవాలని అవేర్‌నెస్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు తారలు. ఇప్పటికే ఇండియాలో మాస్క్ ఇండియా చాలెంజ్ పేరుతో క్యాంపెయిన్ కూడా జరుగుతోంది. తాజాగా హాలీవుడ్ నటి ఓ వింత ప్రయోగం చేసింది. మాస్క్‌ కు బదులు లో దుస్తులు వాడొచ్చని క్రేజీ ఆలోచనను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

హాలీవుడ్‌ కమెడియన్‌  చెల్సా హ్యాండ్లర్‌ తను ధరించే బ్రాను మాస్క్‌ లాగా ఎలా వాడొచ్చో సోషల్ మీడియాలో వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన చెల్సా, వింత ట్వీట్లతో అభిమానులను అలరిస్తోంది. ఇటీవల న్యూడ్‌గా ఓ బుక్‌ను రివ్యూ చేసి ఆ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా బ్రాతో మాస్క్‌ను రూపొందించిన వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.  మాస్క్‌ను మగాళ్లు కూడా వాడొచ్చు అంటూ కామెంట్ చేసింది చెల్సా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

With masks in short supply, we have to take matters into our own hands. Men included. #corona #diy

A post shared by Chelsea Handler (@chelseahandler) on Apr 7, 2020 at 11:49am PDT