అవును మా అమ్మే మా నాన్నను చంపేసింది. అందుకు నేను బాధపడినప్పటికీ ఆ సమయంలో మా అమ్మ తీసుకున్న నిర్ణయానికి గర్వపడ్డాను అని హాలీవుడ్ ప్రముఖ నటి చార్లీస్‌ థెరోన్‌ ప్రపంచానికి తెలియజేశారు. ఈ విషయం ప్రస్తుతం ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది. పలు ఆస్కార్ అవార్డులతో పాటు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న  చార్లీస్‌ థెరోన్‌ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ఒక సంఘటన గురించి బయటపెట్టింది. 

అవును.. ఆత్మ రక్షణ కోసం నా తల్లి నా తండ్రిని చంపేసింది. ఈ విషయంపై ఎవరేమి అన్నా నాకు అనవసరం. ఎందుకంటె మా గుండెల్లోని కన్నీటి విలువ ఎవరికీ తెలియవు. 1991జూన్ లో సౌత్ ఆఫ్రికాలో ఉన్నపుడు. బాగా తాగేసి వచ్చిన మా నాన్న మా అమ్మ మీదకి కోపంగా వచ్చాడు. వెంటనే మేమిద్దరం నా బెడ్ రూమ్ లో తలదాచుకున్నాం.

డోర్ తీయకూడదని తలుపుకు అడ్డంగా నిలుచున్నా. అప్పుడు మా నాన్న మూడుసార్లు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఒక్క బుల్లెట్ కూడా మాకు తగల్లేదు. నిజంగా అది మా అదృష్టమని చెప్పాలి. కానీ ఆ వెంటనే ఆత్మ రక్షణ కోసం మా అమ్మ నాన్నను చంపేయాల్సి వచ్చింది. మా నాన్న తాగుబోతు. రఆయన కారణంగా రోజరోజుకి మా పరిస్థితి ఎంతో దీనస్థితిలో కూరుకుపోయింది’.

15 ఏళ్ల వయసులో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ చెప్పడానికి నేనేమి సిగ్గుపడటం లేదు. మనకు తెలియకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గురించి నేను చాలా మందితో చర్చించాను అని చార్లీస్ వివరణ ఇచ్చారు.