కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రజలు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. చిన్నా పెద్ద పేద ధనిక అన్న తేడా లేకుండా కరోనా బారిన పడుతున్న వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. ఇప్పటికే పలువురు హాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. తాజాగా మరో అంతర్జాతీయ  నటుడిని పొట్టన పెట్టుకుంది ఈ వైరస్‌.

హాలీవుడ్‌‌ నటుడు అలెన్‌ గార్ఫిల్డ్‌(80) కరోనా కారణంగా మంగళవారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కో యాక్టర్ రోనీ బ్లాక్లే అధికారికంగా వెల్లడించారు. `అలెన్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఆయన గొప్ప నటుడు. నాష్‌విల్లే సినిమాలో నాతో కలిసి నటించిన అలెన్‌ కరోనా కారణంగా మృతిచెందారు. ఆయన కుటుంబ సభ్యులకు సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా` అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు.

నాష్‌విల్లే, ది స్టంట్‌​ లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన అలెన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లోకి రాకముందు బాక్సర్‌గా, క్రీడా జర్నలిస్ట్‌గా పనిచేశారు. 1968 లో వచ్చిన 69 చిత్రంతో సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు అలెన్‌. ఎక్కువగా నెగెటివ్‌ రోల్స్‌లో నటించిన ఆయన చివరగా 2016లో రిలీజ్‌ అయిన చీఫ్ జాబు సినిమాలో నటించారు.