బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ రెడీ అవుతుంది. కొత్త సినిమాతో పాటు.. ఆయన ఎవర్ గ్రీన్ ఓల్డ్ మూవీ కూడా రీరిలీజ్ కు రెడీ అవుతోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్ మూవీ నరసింహ నాయుడు బాలయ్య బర్త్ డే సందర్భంగా మరోసారి ఆయన అభిమానులను.. ఆడియన్స్ ను అలరించనుంది. బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 10న 4కె వెర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే బాలయ్య బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ లు అందాయి. బర్త్ డే 10 న అయితే.. అంతకు ముందు రెండు రోజుల నుంచే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాలయ్య , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న NBK108 సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. భగవంత్ కేసరి టైటిల్ ను అనౌన్స్ చేసి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. అంతే కాదు బాలయ్య కు ఇప్పటి వరకూ ఉన్న నటసింహం బిరుదును గ్లోబల్ లయన్ గా మార్చేశారు. దానికి సబంధించిన సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. ఈ టైటిల్ పోస్టర్ తో పాటు సాంగ్ ను సీనియర్ దర్శకుడు బి.గోపాల్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని కలిసి రిలీజ్ చేశారు.
ఇటీవల వరుస రీ రిలీజ్ లు అవుతున్న సందర్భంలో బాలయ్య సూపర్ హిట్ సినిమా నరసింహ నాయుడు కూడా అయన పుట్టిన రోజు జూన్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. నరసింహనాయుడు చరిత్ర సృషించిన చిత్రం. ఇప్పుడీ చిత్రాన్ని డిజిటలైజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి 1000 థియేటర్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పారు.
ఇక ఈమూవీ డైరెక్టర్ బి.గోపాల్ మాట్లాడుతూ.. నరసింహనాయుడు నాకెరీర్‌లో మరచిపోలేని చిత్రం. బాలయ్య అద్భుతంగా నటించారు. ఎమోషన్స్, యాక్షన్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తీరు మరచిపోలేను. కత్తులతో కాదురా… కంటి చూపులతో చంపేస్తా అన్న డైలాగ్ బాలయ్య చెబితేనే బావుంటుంది. ఆ డైలాగ్‌ను ఇప్పటికీ జనాలు మరచిపోలేదు. కథ, పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన డైలాగ్స్, పాటలు, డాన్స్‌లు, మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అన్నారు. ఈసినిమా 100 రోజుల వేడుకను ఇప్పటికీ మర్చిపోలేను అన్నారు బి.గోపాల్.
