Asianet News TeluguAsianet News Telugu

ఇస్మార్ట్ శంకర్ బీభత్సం.. ఇది ఎక్కడ ఆగుతుందో!

డిజిటల్ మీడియం వచ్చాక సినిమా మధ్య భాషాంతరలు బాగా తగ్గిపోయాయి. అన్ని భాషల చిత్రాలని థియేటర్స్ కు వెళ్లకుండానే చూసే అవకాశం ప్రేక్షకుడికి కలుగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడంలో తెలుగు సినిమా కాస్త ముందుగానే ఉంది.

Hindi Dubbed Ismart Shankar movie already got more than 49 million views
Author
Hyderabad, First Published Feb 21, 2020, 5:28 PM IST

డిజిటల్ మీడియం వచ్చాక సినిమా మధ్య భాషాంతరలు బాగా తగ్గిపోయాయి. అన్ని భాషల చిత్రాలని థియేటర్స్ కు వెళ్లకుండానే చూసే అవకాశం ప్రేక్షకుడికి కలుగుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడంలో తెలుగు సినిమా కాస్త ముందుగానే ఉంది. హాట్ స్టార్, యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లలో తెలుగు చిత్రాలకు ఉన్న డిమాండే ఇందుకు నిదర్శనం. 

తెలుగు చిత్రాలని నిర్మాతలు హిందీలోకి దబ్ చేసి నేరుగా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి చిత్రాలకు హిందీ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. తెలుగులో మసాలా చిత్రాలు ఎక్కువగానే తెరకెక్కుతుంటాయి. హిందీలో ఈ మధ్యన ప్రయోగాలు ఎక్కువైపోయాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ బోర్ ఫీలవుతున్నారు. అలాంటి ప్రేక్షకులకు తెలుగు సినిమా వినోదాన్ని అందిస్తోంది. 

సరైనోడు, అ..ఆ, నేను శైలజ లాంటి చిత్రాలు యూట్యూబ్ లో వందలాది మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, అహఁలో గురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలని హిందీలోకి దబ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆ చిత్రాలు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. 

గత ఏడాది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని కూడా హిందీలోకి దబ్ చేసి యూట్యూబ్ లో  రీసెంట్ గా పోస్ట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ  ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని యూట్యూబ్ లోకి వదిలింది. కేవలం 24 గంటల్లోనే 2 కోట్ల వ్యూస్(20 మిలియన్లు) సాధించింది. 5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. రామ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రానికి హిందీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 

బాలయ్య హీరోయిన్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

ఇప్పటికి ఈ చిత్రం 49 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. తెలుగు మాస్ చిత్రాలని హిందీ ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడుతున్నారో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. కేవలం నాలుగు రోజుల్లోనే 49 మిలియన్ల వ్యూస్ అంటే.. ఈ బీభత్సం ఎక్కడ ఆగుతుందో చెప్పడం కష్టం. 

సర్ ప్రైజ్.. రెండవసారి తల్లైన సాగర కన్య!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ జంటగా నటించారు. ప్లాపుల్లో ఉన్న పూరి జగన్నాధ్ కు, రామ్ కు ఈ చిత్రం బాగా ఉపయోగపడింది. రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios