సినీ సెలబ్రిటీలను ఫ్యాన్స్ ఎంతగా ఆరాధిస్తారో తెలిసిందే. వారి ప్రేమని పొందడానికి మన తారలు ఎంతో కష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు అభిమానుల కారణంగా సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నటి హీనా ఖాన్ కి కూడా అదే అనుభవం ఎదురైంది.

ఓ అభిమాని తనను చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడనే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది హీనా ఖాన్. సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఉంటారని.. ఇంటి ముందు రోజుల తరబడి ఎదురుచూసే అభిమానులు కూడా ఉంటారని.. ఇలాంటి వాళ్లను ఎదుర్కోగలం కానీ ఓ అబ్బాయి తనను చాలా కాలంగా టార్చర్ చేస్తున్నాడని చెప్పింది హీనా ఖాన్.

క్లీవేజ్ షోతో రచ్చ.. గ్లామర్ షోలో కంచెలు తెంచేస్తోన్న బ్యూటీ..!

తన నెంబర్ తెలుసుకొని తెగ మెసేజ్ లు చేస్తున్నాడని.. అతను ఎవరో కూడా తనకు తెలియదని.. ఒక్కోసారి తన మీద ఇష్టాన్ని గట్టిగా కేకలు వేస్తూ వీడియోలు తీసి పంపుతూ ఉంటాడని చెప్పింది. దాంతో ఓసారి ఇలాంటి పనులు చేయొద్దంటూ అతనికి రిప్లయ్ ఇచ్చిందట హీనా. కానీ అతడు మాత్రం వినలేదట.

పైగా వేధింపు మరింత ఎక్కువయ్యాయని చెప్పింది. మాట్లాడకపోతే చెయ్యి కోసుకుంటానని, రాత్రి 1 గంటకు కలుస్తానని ఇలా తన వేధించినట్లు చెప్పుకొచ్చింది. నిజంగానే రాత్రిపూట ఇంటికి వచ్చేస్తాడేమోనని భయపడి.. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు చాలాసార్లు నెంబర్ బ్లాక్ చేశానని.. కానీ తరచూ కొత్త నెంబర్ నుండి మెసేజ్ లు చేస్తూనే ఉన్నాడని తెలిపింది.