తన గురించి తప్పుడు ఆరోపణలు చేయడం మానేసి అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో సిద్ధార్థ్ శుక్లా తెలుసుకుంటే బాగుంటుందని అంటున్నారు నటి హిమాన్షి ఖురానా. హిందీలో ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 13 ఇటీవల అట్టహాసంగా ముగిసింది అయితే రియాలిటీ షో విజేతగా నిలిచిన సిద్ధార్థ్ శుక్లా గురించి బిగ్ బాస్ కంటెస్టంట్ నటి హిమాన్షి స్పందించారు.

తాజాగా హిమాన్షి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సిద్ధార్థ్ చాలా లాజికల్ గా ఉంటాడని అందరూ అనుకుంటారని.. అయితే రియాలిటీ షో జరుగుతున్నప్పుడు అంతనూ తనను ఎన్నో సందర్భాల్లో అసభ్య పదజాలంలో తో దూషించాడని అన్నారు.

తన గురించి ఏం మాట్లాడాడో ప్రతి ఒక్కరూ చూశారని.. అంతేకాకుండా తొమ్మిదేళ్ల తన ప్రేమ, బ్రేకప్ గురించి కూడా అతడు రియాలిటీ షోలో ఎన్నో ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చింది. ప్రేమ విఫలమైనప్పుడు ఎంతగా బాధ పడ్డానో అతనికి తెలియదని చెప్పింది.

మరిన్ని విషయాలు చెబుతూ.. ''బ్రేకప్ సమయంలో నేను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ తిరిగి నా వృత్తి, వ్యక్తిగత జీవితాలను ఎన్నో విధాలుగా మార్చుకున్నాను. బ్రేకప్ సమయంలో నా గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చేవి. వాటన్నింటినీ నేను ఎదుర్కోగలిగాను'' అంటూ తెలిపారు.

''నా రిలేషన్షిప్ ని జడ్జి చేయడం మానేసి, ముందు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో సిద్ధార్థ్ నేర్చుకోవడం మంచి పని. అంతేకాకుండా నా గురించి తప్పుగా మాట్లాడడం మానేసి అమ్మాయిలతో మంచిగా ఉండడం తెలుసుకుంటే బాగుంటుంది'' అంటూ మండిపడింది.