రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామంలో సినీ దర్శకుడు, నిర్మాత ఎన్.శంకర్ కి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున ఐదు ఎకరాలను కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది.

ఆయనకి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ గతేడాది జూన్ 21న ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 75ని రద్దు చేయాలని కోరుతూ జగిత్యాలకు చెందిన జె.శంకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.

పవన్, ప్రభాస్ కు అవసరం.. వాళ్లకు తప్పనిసరి.. మిస్సైతే అంతే సంగతులు!

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజిస్టర్ విలువ ఎకరానికి రూ.20 లక్షలు ఉందని, మార్కెట్ విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సంబంధిత భూమిని ఎన్.శంకర్ కి కేటాయించిందని అన్నారు.

ధర్మాసనం ప్రతివాదులైన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏలతో పాటు దర్శకనిర్మాత అయిన ఎన్.శంకర్ లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.