సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు నటన కంటే ఎక్కువగా అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అవుతున్నారు. నటన పరంగా గుర్తింపు తెచ్చుకునే నటీమణులు తక్కువగానే ఉన్నారు. హీరోయిన్ తాప్సి కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ చేసినప్పటికీ బాలీవుడ్ కు వెళ్ళాక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటోంది. 

పింక్, బద్లా లాంటి చిత్రాలే తాప్సి నటనకు నిదర్శనం. పింక్ చిత్రంలో అమితాబ్ కు పోటీగా నటించి ప్రశంసలు  దక్కించుకుంది. మీనాల్ పాత్రలో తాప్సి ఒదిగిపోయి నటించిన విధానం అద్భుతం. ఆ చిత్రంలో తాప్సి పచ్చబొట్టుతో కనిపిస్తుంది. ఆ టాటూ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సి వివరించింది. 

కరోనా ఎఫెక్ట్: అది నా పర్సనల్ మ్యాటర్.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిన సోనాక్షి

మీనాల్ పాత్రకు అనుగుణంగా పచ్చ బొట్టు రూపొందించారు. రెక్కలతో విహరించాలని భావించే అమ్మాయి అని అర్థం వచ్చేలా టాటూ ఉంటుంది. పింక్ మూవీ రిలీజయ్యాక చాలామంది అమ్మాయిలు ఇలాంటి టాటూలే వేయించుకున్నారు. నాకు కూడా టాటూ లంటే చాలా ఇష్టం. ఇప్పటికే నా శరీరం రెండు టాటూలు ఉన్నాయి. తాను నటిని కాకపోయి ఉంటే మెడపై కూడా టాటూ వేయించుకునేదాన్ని అని తాప్సి చెప్పుకొచ్చింది. 

ఈ ఏడాది తాప్సి థప్పాడ్ అనే చిత్రంలో నటించింది. తెలుగులో తాప్సి ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, షాడో, సాహసం లాంటి చిత్రాల్లో నటించింది.