సోషల్ మీడియాలో తనను ఎగతాళి చేయబోయిన బీజేపీ నేతకి ప్రముఖ నటి స్వరా భాస్కర్ కౌంటర్ వేశారు. అంతేకాదు.. 'కూర్చోండి అంకుల్' అంటూ పెద్ద క్లాస్ తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఇటీవలే స్వరా భాస్కర్ ఓ ట్వీట్ చేశారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేసిన యోగి.. షహీన్ బాగ్ లో బిర్యానీ పంచుతూ కేజ్రీ బిజీగా ఉన్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన స్వరా.. 'ఐ థింక్ హీ ఈజ్ హ్యాంగ్రీ (Hangry) ఫర్ బిర్యానీ (ఎవరైనా ముందు ఈయనకు బిర్యానీ తినిపించండి. బాగా ఆకలిగా ఉన్నట్లున్నాడు)' అంటూ యోగిపై కామెంట్ చేశారు.

దీన్ని సీరియస్ గా తీసుకున్న భారతీయ జనతా యువమోర్చా ఉపాధ్యాక్షుడు రాహుల్ కొఠారి ఆమెకి బదులిచ్చాడు. 'పబ్లిసిటీ కోసం ఇంత పిచ్చుంది గానీ, హంగ్రీ( Hungry)స్పెల్లింగ్ కూడా రాదు' అని ఆమె ట్వీట్‌ కి  బదులిచ్చాడు.

ఇది చూసిన స్వరా భాస్కర్.. 'సిట్ డౌన్ అంకుల్' అంటూ 'హాంగ్రీ' అర్ధాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.