అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయం అయిన షాలినీపాండే కు ఆ తర్వాత వరసపెట్టి ఆఫర్స్ వచ్చాయి. అయితే ఒక్కటీ సరిగ్గా ఆమెకు ఆ స్దాయి గుర్తింపు తేలేదు. ఎన్టీఆర్  కథానాయకుడు, మహానటి, 118 వంటి సినిమాలు ఏమీ కలిసి రాలేదు. ఈ నేఫధ్యంలో ఆమెకు దిల్ రాజు పిలిచి తన తాజా చిత్రం ఇద్దరిలోకం ఒకటే లో ఆఫర్ ఇచ్చారు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న ఆ చిత్రంలో ఆమె పాత్ర ప్రత్యకమైనదని ఒప్పుకుంది. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న నిశ్శబ్దం సినిమాలోనూ ఆమె నటిస్తోంది. అంతవరకూ బాగానే ఉంది.

అయితే రీసెంట్ గా ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. అప్పటి నుంచి డేట్స్ ఇవ్వక దిల్ రాజు ని ఇబ్బంది పెడుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. బాలీవుడ్ సినిమాకు ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ దాదాపు ఫినిషింగ్ స్టేజికు వచ్చిన సినిమాని ప్రక్కన పెడుతోందని అంటున్నారు. దిల్ రాజు వంటి నిర్మాతనే లెక్క చేయకపోతే మిగతా నిర్మాతలను ఆమె కేర్ చేస్తుందా అని మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

ఇదిలా ఉంటే తమిళంలోనూ ఆమె ఓ సినిమా కమిటైంది. ఆ సినిమాకు ఆమె ఇలాగే అక్కడ కూడా ట్విస్ట్ లు ఇస్తోందిట. దాంతో షాలినీ పాండే ను కూర్చోబెట్టి మాట్లాడాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారట. దిల్ రాజు వంటి నిర్మాత తలుచుకుంటే ఇండస్ట్రీలో ఆమె ఆఫర్స్ పట్టుకోవటం కష్టమని, తెలుగు పరిశ్రమ చాలా మంచిదని, ఇక్కడ ఇచ్చే రెమ్యునేషన్స్, గౌరవం మిగతా ఏ పరిశ్రమలోనూ ఇవ్వరని, ఆ విషయం బాలీవుడ్ నుంచి వచ్చే చాలా మంది హీరోయిన్స్ గుర్తించలేదని అంటున్నారు. అయితే ఈ మ్యాటర్ లో నిజమెంతో తెలియాల్సి ఉంది.