'జయం' సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన నటి సదా.. చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఓ రియాలిటీ షోకి జడ్జిగా కూడా వ్యవహరించారు. కానీ ఏ సినిమాలోనూ.. ఏ షోలోనూ డ్రెస్సింగ్ విషయంలో కానీ అందాల ఆరబోతలో కానీ హద్దు దాటింది లేదు. అలాంటిది ఆమె ఓ వేశ్య పాత్రలో నటించడానికి ఒప్పుకొని షాకిచ్చింది. మొదట ఈ సినిమాకి టైటిల్ గా 'టార్చిలైట్' అనుకున్నారు.

కానీ ఇప్పుడు 'శ్రీమతి 21F' అని మార్చారు. ఈ సినిమాలో సదా..  అర్థరాత్రి హైవేలపై విటుల కోసం ఎదురు చూసే క్యారెక్టర్‌లో కనిపించనుంది. అబ్దుల్ మజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడు, ఆంధ్ర హైవేలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ట్రైలర్ ని బోల్డ్ గా కట్ చేశారు.

 

ఊహించని పరిస్థితుల కారణంగా హీరోయిన్ వేశ్యగా మారాల్సి వస్తుంది. అటువంటి పాత్రలో సదా షాకింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తన దగ్గరకి వచ్చిన విటుడితో.. ''జాకెట్ విప్పనా..? లేక నువ్వే విప్పుతావా..?'' అని అడుగుతూ బోల్డ్ సీన్స్ లో నటించింది. ఈ సినిమాతో దర్శకుడు ఓ సందేశాన్ని చెప్పబోతున్నాడు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం డైరెక్టర్ ఎందరో హీరోయిన్స్‌ని సంప్రదించారట. కానీ వేశ్య క్యారెక్టర్ అనగానే వెనక్కు తగ్గారట. సదా మాత్రం కథ విన్న వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ సినిమాని నవంబర్ 1న విడుదల చేయనున్నారు.