కరోనా ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశమంతా ప్రజలు ఇంటికే పరిమిత మవుతున్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చాలా సీరియస్‌గా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఒక రోజు పాటు జనతా కర్ఫ్యూ పాటించాలంటూ కోరారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్ర పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు.

అంతేకాదు తమ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరతరం శ్రమిస్తున్నడాక్టర్లు, మున్సిపాలిటీ కార్మికులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాలని ప్రధాని కోరారు. వారికి సంఘీభావంగా సాయంత్ర 5 గంటలకు ప్రజలు తమ బాల్కనీలలోకి వచ్చి చప్పట్లు కొడుతూ వారికి కృతజ్ఞతలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కష్టకాలంలో తమకు రక్షణగా నిలిచి వారికి మద్దతు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. దాదాపు దేశంలోని ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన రీతిలో చప్పుడు చేస్తూ సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు కూడా తమ అభిమానులకు ఆదర్శంగా నిలిచారు. దాదాపు సినీ రాజకీయా ప్రముఖుల అంతా చప్పట్లు కొడుతూ గంటలు మోగిస్తూ తమ వంతుగా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ప్రగ్యా జైస్వాల్‌ ఎమోషనల్ అయ్యింది. తన ఇంటి కిటికీ నుంచి రియల్ హీరోస్‌కు మద్దతుగా చప్పట్లు కొడుతూ ప్రజల నుంచి వచ్చిన స్పందనతో కన్నీరు పెట్టుకుంది. దేశమంతా ఒక్కతాటిమీదకు రావటంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆనంద బాష్పాలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రగ్యా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌ గానే ఉంటుంది.