సినీ నటి నమిత బీజేపీ తీర్ధం పుచ్చుకోవటం తమిళ సినీ,రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జయప్రకాశ్ నడ్డా సమక్షంలో శనివారం ఆమె పార్టీ కండువా కప్పుకోవటం మీడియాలో హైలెట్ అయ్యింది. ఈ విషయమై తమిళ మీడియా, సోషల్ మీడియాలో విశేషమైన చర్చ మొదలైంది. వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న నమిత ...ఏదో పార్టీలో తన ప్రస్దానాన్ని వెతుక్కోవటం లో వింతేమీ లేదని, అయితే పార్టీకి ఆమె వల్ల ప్రత్యేకంగా కలిసి వచ్చేదేమిటంటున్నారు. కమల్ హాసన్ వంటి స్టార్ ..పార్టీ పెడితే ఓట్లు పడలేదని, రజనీ ఇప్పటికీ ప్రత్యక్ష్య రాజకీయ  రంగ ప్రవేశం గురించి ఆలోచిస్తున్నారని, విజయ్ కాంత్ వంటివాళ్లు దాదాపు తప్పుకున్నట్లే అని ఇలాంటి టైమ్ లో సిని గ్లామర్ తో ఈ మాజీ నటి పార్టికి ఏమి చేయగలదని అంటున్నారు.

అయితే  తమిళనాట అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీకి నమిత పార్టీలో చేరడంతో ఆమె ఇమేజ్ పార్టీకి కలిసి వస్తుందని ఆమె అభిమానులు అంటటున్నారు.  తమిళనాడులో నమితకు భారీ సంఖ్యలో ఒకప్పుడు అభిమానులున్నారు. గతంలో ఆమెకు ఒక గుడిని కూడా కట్టారు. గుజరాత్ కు చెందిన నమిత సినీ రంగంలో తనను ఆదరించిన తమిళనాడు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు.  అయితే ఆమెను రాజకీయ సభల్లో జన సమీకరణకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉపయోగపడతారని భావించి పార్టీలోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. ఏదైమైనా ఫామ్ లో లేని నమితకు అధికారంలో ఉన్న బీజేపి పార్టీలో చేరటం కొంతవరకూ కలిసి వస్తుంది.

ఇక  నమిత దక్షిణాదిన పలు భాషల్లో నటించింది. తెలుగులో సొంతం సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నమిత ఆ తరువాత జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. గతకొంత కాలంగా ఆమెకు అవకాశాలు తగ్గడంతో.. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాల వైపు అడుగులు వేశారు.